రెండేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య

రెండేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య
హుస్సేన్ సాగర్ లో దూకి రెండేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. పాతబస్తీలో వ్యాపారం చేస్తున్న పృథ్వీలాల్, ఛార్టర్ అకౌంట్ గా వర్క్ చేస్తున్న కీర్తిక అగర్వాల్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. అయితే.. ఈ దంపతుల మధ్య గొడవలు రావడంతో ఏడాదిన్నర నుంచి బహుదూర్ పూర్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దే కూతురుతో కలిసి ఉంటుంది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ నెల 2న హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమార్తె, మనవరాలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. అయితే.. ఆత్మహత్యకు పాల్పిడిన మహిళ కీర్తిక అగర్వాల్ గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే.. ఆమె కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించిన పోలీసులు మంగళవారం పాప మృతదేహాన్ని గుర్తించారు.
