Mobile application | రైతుల‌పై ఇదొక కుట్ర‌!

Mobile application | రైతుల‌పై ఇదొక కుట్ర‌!

  • యూరియా యాప్ నాటకం

Mobile application | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్(Mobile application) విధానం, యూరియా యాప్ ఇదొక పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(MLA KTR) అన్నారు.

రైతుల లైన్లు, తమ చేతగానితనం బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ ‘మొబైల్ యాప్ నాటకాన్ని’ కాంగ్రెస్ మొదలుపెట్టింద‌ని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ‘లైన్లను దాచే’ ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాల‌ని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వ‌ల్లే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో(queue lines) నిలబడాల్సిన పరిస్థితి రాలేద‌ని గుర్తు చేశారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్

రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలన్న కేటీఆర్ అన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్నివర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి(government) స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply