MLA Venigandla | భక్తిశ్రద్ధలతో..

MLA Venigandla | భక్తిశ్రద్ధలతో..
MLA Venigandla, గుడివాడ, ఆంధ్రప్రభ : భగవంతుని ఆశీస్సులతో సర్వమాలదారులు భక్తిశ్రద్ధలతో దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Venigandla) ఆకాంక్షించారు. గుడివాడ పట్టణం బంటుమిల్లిరోడ్డులోని శ్రీ స్వామి అయ్యప్ప వారి దేవస్థానంలో ప్రారంభం కానున్న మండల మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవస్థాన అన్నదాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను సహకరిస్తానని కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాము అన్నారు.
శ్రీ స్వామి అయ్యప్ప వారి కరుణకటాక్షలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అయ్యప్ప దీక్షాదారులతో పాటుగా సర్వమాలాదారులు తమ దీక్షలను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ (Gudivada) మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి కుమార్, టీడీపీ నాయకులు యక్కలి మణిదీప్, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ సాయన రాజేష్, అన్నదాన కమిటీ సభ్యులు తాళ్లూరి వెంకట సుబ్బారావు, నేరెళ్ల శ్రీమన్నారాయణ, ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
