MLA | సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యంగా..
- ఎన్నికల బరిలో దాసరి నరేందర్
MLA | కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్నరాత్పల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా దాసరి నరేందర్ ఎన్నికల బరిలో నిలిచాడు. దాసరి నరేందర్ తల్లి దాసరి నవలోక 2018లో జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా విజయం సాధించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రామానికి అధిక నిధులు(High funding) తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు.
ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ గ్రామ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. చిన్న రాతుపల్లి గ్రామం జనరల్(village general) కు కేటాయించడంతో నవలోక తనయుడు నరేందర్ బరిలో నిలిచాడు. ఈ సందర్భంగా దాసరి నరేందర్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే విజయరమణారావు(MLA Vijayaramana Rao) సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తు ఓటు వేసి నరేందర్ ను గెలిపిస్తామని చెబుతున్నారు.

