MLA | లక్కారం సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి

MLA | లక్కారం సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి

MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మర్సకుల సరస్వతి తిరుపతిని గెలిపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రజలకు కోరారు. ఆయన ఈ రోజు ఉట్నూర్ లక్కారం గ్రామపంచాయతీలోని నవోదయ నగర్, కేబీ నగర్, రాజా దేవుషా గూడ, వేణునగర్ లాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్కారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మార్సకోలా సరస్వతిని పరిచయం చేస్తూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ ప్రచారంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్యకు, అవసరం ఉన్న చోట నూతన సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బలపరిచిన అభ్యర్థుల గెలిపిస్తే గ్రామ పంచాయతీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే ప్రజల కోరారు.

Leave a Reply