MLA | యువతకు మార్గదర్శకం

MLA | యువతకు మార్గదర్శకం

  • వివేకానంద సూక్తులు అనుస‌ర‌ణీయం
  • ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
  • జగ్గయ్యపేటలో వివేకానంద విగ్రహానికి నివాళులు

MLA | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భంగా జగ్గయ్యపేట బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన ఆయ‌న విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు బోధించిన దృఢ సంకల్పం, ఏకాగ్రత సూక్తులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

అపజయం, విజయానికి ఒక మెట్టు మాత్రమేనని, నిరంతర ప్రయత్నాలతోనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, విద్యతో మహిళలు శక్తివంతంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల సీతమ్మ, పట్టణ కౌన్సిలర్లు, మహిళలు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply