చికిత్స పొందుతున్న చిన్నారులకు అప్యాయ పలకరింత
రోగులకు పండ్లు పంపిణి..
అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా
నాణ్యమైన వైద్య అందిస్తున్న యాజమాన్యానికి ప్రశంసలు
అతిథులుగా వచ్చిన సుందరిమణులకు సత్కారం

హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు నగరంలోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు. వారికి కొన్ని బహుమతులను అందించారు.. మరికొందరు రోగులు పండ్లు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సుందరి మణులు ఎసి హాస్సిటల్ వైద్య బృందంతో మాట్లాడారు.. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఎజి హాస్పిటల్ యాజమాన్యాన్ని భామలు అభినందించారు.. ఈ సందర్భంగా తమ ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కడ సిబ్బంది సత్కరించారు.. అలాగే జ్ఞాపికలు అందజేశారు..
