Minister Seetakka | కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు…

Minister Seetakka | కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు…

  • మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన సురేఖ సీతక్కలు

Minister Seetakka | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో ఈనెల 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావలసిందిగా కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖలు ఈ రోజు ఎర్రవెల్లికి చేరుకున్నారు.

అక్కడ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి వెళ్లారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. కెసిఆర్ కు మంత్రులు(Ministers) శాలువా కప్పి ఆహ్వాన పత్రికలను, మేడారం జాతర ప్రసాదాన్ని అందజేశారు. కాగా తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను కెసిఆర్ ఆత్మీయంగా పలకరించినట్లు సమాచారం.

Minister Seetakka |

అతిధి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీర తాంబూలాలతో ఆడబిడ్డలకు సాంప్రదాయ సత్కారం చేసినట్లు తెలిసింది. మహిళా మంత్రులను బాగున్నారా అమ్మ అంటూ సంబోధించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కొండా సురేఖ, సీతక్కలకు కెసిఆర్, ఆయన సతీమణి శోభారాణిలు సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం మహిళా మంత్రులకు తేనేటి విందు ఇచ్చినట్లుగా సమాచారం. తొలుత ఎర్రవెల్లి కేసిఆర్ నివాసానికి చేరుకున్న మంత్రులు సురేఖ , సీతక్క లకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు.

Minister Seetakka |
Minister Seetakka |
Minister Seetakka |

CLICK HERE TO READ MORE : ordinary devotees | ఇంద్రకీలాద్రిపై…

CLICK HERE TO READ MORE :

Leave a Reply