Minister | ప్రచారంలో ముందంజలో ముస్కూ దీప్తి

Minister | ప్రచారంలో ముందంజలో ముస్కూ దీప్తి
Minister | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి పట్టణ సర్పంచ్ అభ్యర్థి ముస్కూ దీప్తి నిశాంత్ రెడ్డి ప్రచారంలో ముందుండి విజయ గతంలో దూసుకు పోతున్నారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్(Minister Adluru Laxman Kumar) అండదండలతో గొల్లపల్లిలో పలు అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.
గెలిచిన వెంటనే లక్షలాది రూపాయల నిధులు(Funds) తెచ్చి గొల్లపల్లి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇతర సమస్యలను పరిష్కరిస్తానని దీప్తి నిశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్షల రూపాయలు నిధులతో గొల్లపల్లిలో పలు అభివృద్ధి పనులు చేశనని చెప్పారు. గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని నిశాంత్ రెడ్డి తెలిపారు.
