చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(State Minister for Labour and Employment Gaddam Vivek Venkataswamy) ఈరోజు తన స్వంత నియోజక వర్గం చెన్నూరులోని గ్రామాలలో నీట మునిగిన పంట చేలను సందర్శించి రైతులతో మాట్లాడారు.
మొదట క్యాంప్ కార్యాలయం నెలకొల్పిన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)తో కలిసి మండలంలోని సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) బ్యాక్ వాటర్‌తో నీట మునిగిన పత్తి చేలను సందర్శించి రైతుల పంట నష్టం వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. మంత్రి వివేక్‌కు సుమారు రెండు వందల ఎకరాల పంట నష్టపోయినట్లు రైతులు వివరించారు.