Minister | విధ్వంసం నుంచి.. అభివృద్ధి వైపు అడుగులు

Minister | విధ్వంసం నుంచి.. అభివృద్ధి వైపు అడుగులు
- రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి.జనార్దన్ రెడ్డి
- రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.330 కోట్లు మంజూరు
Minister | (ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో) : వైసీపీ విధ్వంసకర పాలన నుంచి అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇవాళ మచిలీపట్నంలో పలు రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంలో పాలన ఎంత విధ్వంసకరంగా ఉందో అదేవిధంగా రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. కనీసం గుంతలు పూడ్చిన పాపాన పోలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రహదారులకు రూ.3300 కోట్లు మంజూరు చేసి రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నామన్నారు.
సోదరుడు, మంత్రి కొల్లు రవీంద్ర తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని పదే పదే కోరుతుండేవారని తెలిపారు. ఇందులో భాగంగా మచిలీపట్నంకు రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు. ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారికి మౌళిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సహయ సహకారాలతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నట్లు తెలిపారు. మంత్రి లోకేష్ ఎప్పుడు రోడ్ల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసుకున్నారన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రహదారులపై శ్రద్ధ తీసుకోవటం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాలో మిగిలిన రహదారులకు త్వరలో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత పూర్తి చేశామన్నారు. మచిలీపట్నంలో నుంచి కమ్మవారి చెరువు వయా చిన్నాపురం రూ.6 కోట్లు, వయా కోనకు రూ.1.50 కోట్లు, తాళ్లపాలెం నారాయణపురంకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు. కొన్ని రహదారులు పూర్తయ్యాయని, మిగిలిన రోడ్లను పూర్తి చేస్తానని తెలిపారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… నియోజకవర్గానికి రూ.30 కోట్లు మంజూరు చేసి రహదారుల అభివృద్ధికి కృషి చేసిన మంత్రి జనార్ధన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు. డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు.
