ఒకరు మృతి.. 15 మందికి గాయాలు

(టంగుటూరు, ఆంధ్రప్రభ) : మినీ బస్సు (Mini bus) బోల్తా పడి ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జాతీయ రహదారి పై రైస్ కాలేజీ ఎదుట చోటు చేసుకుంది. టంగుటూరు మండలంలోని వల్లూరు సమీపంలోనే జాతీయ రహదారి పై సోమవారం తెలువారు జామున ఈ ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లా (Chittoor district) పలమనేరు నుంచి విజయవాడ వెళ్లుతుండగా ప్రైవేట్ విద్యుత్ కాంటాక్ట్ ఉద్యోగుల మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తో రైస్ కాలేజీ ఎదుట డివైడర్ డి కొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ (Ongole DSP) ఆర్, శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు వైద్యం నిమిత్తం తరిలించారు. ఈ సందర్బంగా ఒంగోలు డిఎస్పీ మాట్లాడుతు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి ధర్యాపు చేస్తున్నాం. డిఎస్పీ వెంట ఒంగోలు టూటైన్ సి ఐ శ్రీనివాస్, టంగుటూరు ఎస్ ఐ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply