MI vs CSK | టాస్ గెలిచిన ముంబై.. తొలి బ్యాటింగ్ చెన్నైదే !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజ‌న్ లో భాగంగా నేడు మ‌రో ఉత్కంఠ మ్యాచ్ కు రంగం సిధ్దమైంది. ఈరోజు డ‌బుల్ హెడ‌ర్ లో భాగంగా రాత్రి 7:30 జ‌ర‌గ‌నున్న మ్యాచ్ లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ – ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వాఖండే స్టేడియంలో చెన్నై తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

ఇంపాక్ట్ ప్లేయ‌ర్లు

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రాబిన్ మింజ్, రాజ్ అంగద్ బావా, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు

చెన్నై సూపర్ కింగ్స్: సామ్ కర్రాన్, అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్

జట్టు మార్పులు:

ముంబై ఇండియన్స్ : కర్ణ్ శర్మ గాయం కార‌ణంగా ఈ మ్యాచ్ కు దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో అశ్వనీ కుమార్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది.

చెన్నై సూపర్ కింగ్స్: రాహుల్ త్రిపాఠి, అన్షుల్ కాంబోజ్ స్థానంలో.. ఆయుష్ మ్హత్రే , శివమ్ దూబే తుది జ‌ట్టులోకి వచ్చారు. కాగా, 17 ఏళ్ల ఆయుష్ మ్హత్రే తన హోం గ్రౌండ్ వేదిక‌గా చెన్నై త‌రుఫున‌ త‌న‌ తొలి టీ20 అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నాడు.

తుది జ‌ట్లు

చెన్నై సూపర్ కింగ్స్ : షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.

ముంబై ఇండియన్స్ : ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్.

ముఖాముఖి పోరు

ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో చెన్నై పేలవమైన ప్రదర్శనలతో సతమతమవుతోంది. సీఎస్కే ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి, రెండింటిలో మాత్రమే గెలిచి, ఐదు ఓడిపోయింది. దీంతో (-1.276) ర‌న్ రేట్ తో పాయింట్స్ టేబుల్లో అట్ట‌డ‌గున నిలిచింది.

మరోవైపు, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించినా.. నెమ్మదిగా కోలుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు, ఎంఐ 7 మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో (0.239) రన్ రేట్‌తో 7వ స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్ టోర్నీల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ – ముంబై ఇండియ‌న్స్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 38 మ్యాచ్‌ల్లో సిఎస్‌కె జట్టు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఎంఐ జట్టు 20 సార్లు గెలిచింది. అయితే, నేటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చేయాలని చూస్తుండగా, ముంబై తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుంది. దీంతో నేటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *