MGM Hospital | కాజీపేటలో కత్తితో దాడి..
- ఫాస్ట్ ఫుడ్ సెంటర లో పని చేసే వ్యక్తి హత్యాయత్నం..
MGM Hospital | కాజీపేట, ఆంధ్ర ప్రభ : కాజీపేట పట్టణంలోని భవానీ టాకీస్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్(Fast food center) వద్ద కత్తితో దాడి చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన పుట్టపర్తి రాజు కుమార్ పై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి కత్తితో దాడి చేసి మెడపై గాటు, గాయాలు కలిగించాడు.
స్థానికులు, బాధితుడి సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం రాజు కుమార్, స్నేహితుడు ఇద్దరూ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఆహారం తినడానికి వెళ్లారు. అక్కడ సామాన్య విషయంపై మాటలు జరుగుతుండగా గొడవ జరిగింది. చిల్లర గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఆవేశంతో పక్కనే ఉన్న కత్తిని తీసుకొని రాజు మెడపై దాడి చేశాడు. ఈ దాడి జరుగుతుండగా రాజు కుమార్ తో పాటు ఉన్న స్నేహితుడు భయంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
రక్తం కక్కుతూ రోడ్డుపై పడిపోయిన రాజు, కుమార్ ను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 100 డయల్(100 Dial) చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 108 సాయంతో గాయపడిన రాజు కుమార్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో బంధువులు రాజు కుమార్ ను హైదరాబాద్‌కు తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

