క్రీడకారులను అభినందించిన ఎంఈవో

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ పాఠశాల విద్యార్థులను మండల విద్యా వనరుల అధికారి ఎన్.ఆంధ్రయ్య బుధవారం అభినందించారు.నిజామాబాద్ జిల్లా తీర్మాన్పల్లి లో జరిగిన సీఎం కప్పు లో నెట్ బాల్ క్రీడాల్లో బాలికల విభాగంలో కోన సముందర్ పాఠశాల విద్యార్థులు జిల్లాలో ద్వితీయ స్థానం సాధించారు.అలాగే పీఎం శ్రీ పాఠశాలలో జరిగిన నిజామాబాద్ జిల్లాలోని డి ఎస్ఎ మైదానంలో జరిగిన కబడ్డీ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. గెలుపొందిన క్రీడాకారులను మండల విద్యాధికారి ఆంధ్రయ్య గెలుపొందిన విద్యార్థి క్రీడాకారులను అలాగే ఇంతటి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి. రమేష్ గౌడ్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రి మధుపాల్,గెజిటెడ్ బషీరాబాద్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్,కృష్ణ కుమార్, బంతిలాల్,కోన ససముందర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply