లొద్ది రామన్న జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని లొద్ది రామన్న జాతర ఉత్సవాల సందర్భంగా భీంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు వైద్య సేవలు అందించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరంలో వైద్య సిబ్బంది జమున, రవి, అలాగే ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply