Maryland | అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య

Maryland | అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య
Maryland | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భారతీయ యువతి గోడిశాల నిఖిత అపార్ట్‌మెంట్‌లో (Appartment) మాజీ బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది. వేడుకల నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహం అపార్ట్‌మెంట్‌లోనే లభ్యమవడంతో ఈ ఘటన సంచలనం రేపింది.
గోడిశాల నిఖితకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… 27 ఏళ్ల నిఖిత కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిఖిత తల్లి హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. నిఖిత హైదరాబాద్ (Hyderabd) జేఎన్‌టీయూ నుంచి ఫార్మసీ డిగ్రీ పొందారు. భారత్‌లో మూడేళ్ల పాటు ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేశారు. అనంతరం మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు.
ఆమె యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ నుండి హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మేరీల్యాండ్‌లోని వెడా హెల్త్‌లో నిఖిత… డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నిఖిత… ఫార్మసీ, క్లినికల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే మేరిల్యాండ్‌లో (Maryland) ఉంటున్న నిఖిత న్యూ ఇయర్ వేడుకల నుంచి కనిపించకుండా పోయారు. అయితే జనవరి 2న నిఖిత కనిపించడం లేదని ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
