మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి..

మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి..

-స్టేషన్ ఘన్‌పూర్‌లో మార్వాడీల అరాచకం అతి మించుతోంది
-రైతుల బంగారం, ఆస్తులపై కన్నేశారంటూ ఆగ్రహం
-తెలంగాణ రైతన్నల జోలికి వస్తే ఊరుకునేది లేదు
-అధిక వడ్డీలు వసూలు చేస్తున్న దుకాణాలను బహిష్కరించాలి
-ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
-బంగారం కుదువ పెట్టిన వారికి న్యాయం చేయాలి
తెలంగాణ క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్విరాజ్ యాదవ్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్‌లో మార్వాడి వ్యాపారులు అధిక వడ్డీ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలంగాణ క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్విరాజ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపాలిటీ పరిధిలో కుదువ బంగారం అధిక వడ్డీ వసూళ్ల ఘటన రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సోమవారం ఆయన బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఓం గణేష్ జువెలర్స్, గంగా జువెలర్స్ దుకాణాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి షాప్ యజమానులను నిలదీశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులో ఉండేలా చర్యలు చేపట్టారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సమస్య మరింత తీవ్రం కాకుండా చూసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్వాడీలను బైకాట్ చేయాలి. స్టేషన్ ఘన్‌ పూర్‌లో రోజురోజుకు వారి ఆగడాలు పెరుగుతున్నాయి. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. అవసరమైతే మార్వాడి దుకాణాలను ప్రజలు బహిష్కరించాలని పిలుపుని చ్చారు. మార్వాడిలతో కొంత మంది వ్యాపారులు, రాజకీయ వ్యవస్థ కలిసి తెలంగాణను, హైదరాబాద్‌ను వేరు చేసే విధంగా ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా 10 నుంచి 15 కోట్ల రూపాయల నగదు అవసరమైతే ఈ మార్వాడి వ్యాపారుల దగ్గర సులభంగా దొరుకుతుందన్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఇవి ప్రజల డబ్బులే కాదా? అని ప్రశ్నించారు. బిల్లులు లేకుండా లావాదేవీలు, అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు.

-రైతన్నల జోలికి వస్తే ఊరుకునేది లేదు:
తెలంగాణ రైతన్నల జోలికి వస్తే ఊరుకునేది లేదని పృధ్విరాజ్ యాదవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక బాధిత రైతు ఎదుర్కొన్న అవమానకర ఘటనను ప్రస్తావించారు. ఓం గణేష్ జువెలర్స్ దుకాణంలో రైతు బంగారం కుదువ పెట్టి డబ్బు తీసుకున్నాడు. తర్వాత వడ్డీతో పాటు చక్రవడ్డీ చెల్లించేందుకు వెళ్లినా అవమానకరంగా ప్రవర్తించారని సమాచారం వచ్చిందన్నారు. మొదట 3 శాతం వడ్డీ చెబుతూ గడువు పెరిగిందని 6 శాతం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలలకు ఒక రేటు, 18 నెలలకు మరో రేటు అంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెబుతున్నారని తెలిపారు.

-ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి:
రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు వెంటనే ఇస్తామని చెప్పి ముందుగా పొలం లేదా ప్లాట్‌ పై సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని పృథ్వి యాదవ్ మండిపడ్డారు. మరో బాధిత రైతు గంగా జువెలర్స్ యాజమాని వద్ద వ్యవసాయ అవసరాల కోసం మూడు తులాలు ఒక గ్రాము బంగారం కుదువ పెట్టి రూ.1 లక్ష తీసుకు న్నట్లు తెలిపారు. గడువు పూర్తయిన తర్వాత వడ్డీతో సహా మొత్తం చెల్లించేందుకు వెళ్లినా బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. కుమార్తె వివాహం ఉందని చెప్పినా ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలని కొత్త షరతులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పంద పత్రాలను హిందీలో మాత్రమే రాయడం వల్ల రైతులకు షరతులు పూర్తిగా అర్థం కావడం లేదన్నారు. రైతులకు అర్థమయ్యేలా తెలుగులో ఇవ్వకపోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం దీని పై వెంటనే దృష్టి సారించాలని కోరారు.

-బంగారం కుదువ పెట్టిన వారికి న్యాయం చేయాలి:
బంగారం కుదువ పెట్టిన వారికి న్యాయం చేయాలి. అనవసర షరతులు పెట్టకుండా వెంటనే నగలు తిరిగి ఇవ్వాలని పృధ్విరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న మార్వాడి దుకాణాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. యువత జాబితాలు తయారు చేసి అలాంటి షాపుల వద్దకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కష్టజీవులకు అందరూ తోడుగా నిలవాలని కోరారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లయితే వెంటనే ఆ విధానాన్ని నిలిపివేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

రైతుల ఆస్తుల పై రిజిస్ట్రేషన్లు చేయడం, వడ్డీపై వడ్డీ వేసి మొత్తం పెంచడం చట్ట విరుద్ధమైతే బాధ్యుల పై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పై రెవెన్యూ, పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు గుగులోత్ అరుణ్ లాల్, మట్టెడ అంజయ్య, త్రిషల్, సిపిఐ జిల్లా నాయకులు తోట రమేష్, సాదం రమేష్, సాదం రాజేందర్, ఏఐ ఎస్ఎ ఫ్ నాయకులు రహ్మ్మతుల్లా, యూనస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply