Mandali Buddhaprasad | దేవాలయాల అభివృద్ధికి నిధులు
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
Mandali Buddhaprasad | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని రెండు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని ఏక రాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.రెండున్నర కోట్లు, నాగాయలంకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి రూ.కోటి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయాల పునరుద్ధరణ పనులకు సర్వ శ్రేయోనిధి నుంచి ఈ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే ఆయా గ్రామాల భక్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు.

