12వ వార్డు అభివృద్ధి కోసం రహీం పటేల్ ను గెలిపించండి

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రహీం పటేల్ ను ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే వారంతా ఆదరించి గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు మాజీ మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి విజ్ఞప్తి చేశారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 12వ వార్డులో రహీం పటేల్ కు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రచారం నిర్వహించారు .కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరగనున్న అభివృద్ధిని వివరించి ఓటు వేయాలని కోరారు. దశాబ్దాలుగా వెనుకబడ్డ మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోతే ఇక అభివృద్ధి చేసుకోలేమని గుర్తించాలన్నారు.
.అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో మక్తల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణంతో పాటు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలు అనేవి ఉండకుండా చూడడమే లక్ష్యంగా మంత్రి శ్రీహరి పనిచేస్తున్నారు అని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం అప్పజెప్పాలని కోరారు .అందుకోసం ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూరుద్దీన్,ఉసామోద్దీన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
