Mahakumbh | రక్తదాన శిబిరం

Mahakumbh | రక్తదాన శిబిరం
Mahakumbh | బోధన్, ఆంధ్రప్రభ : సాలూర మండలంలోని హున్సా గ్రామంలో జీవనదాన మహాకుంభ్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. మీరు జీవించండి – ఇతరులను జీవించనీయండి అనే నినాదం తో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ గంగాధర్ రక్తదానం చేసి గ్రామ యువతకు స్ఫూర్తి కలిగించారు. కార్యక్రమంలో వంద మంది యువత, స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేశారు.
ఈకార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మురిగె శంకర్, నాని, నిరీక్ష పాన్ కార్ రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కథలే, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మందర్న రాజు పటేల్, మాజీ జిల్లా అధ్యక్షులు జైరామ్ పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ద్వారా తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు. “మీరు జీవించండి – ఇతరులను జీవింపజేయండి” అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరం గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని వారు తెలిపారు.
