Made for Each Other | అన్యోన్య దంపతుల విషాద గాథ

Made for Each Other| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, కోసిగి మండలం, దొడ్డి బెళగల్ గ్రామంలో మానవీయత(Humanity)ను కదిలించే ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన వృద్ధ దంపతులు(Elderly couple) వీరన్న, పార్వతమ్మ కలిసి జీవించి, చివరకు కలిసి మరణించారు. వయస్సు పెరగడంతో పాటు అనారోగ్యం కారణంగా వీరన్న మంగళవారం రాత్రి మృతి చెందారు. జీవిత భాగస్వామి(Spouse) మరణాన్ని భరించలేకపోయిన పార్వతమ్మ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. తనతో జీవితం పంచుకున్న మనిషి కోల్పోయిన వేదన ఆమెను క్షణం కూడా నిలబడనీయలేదు.
గంటల వ్యవధిలోనే ఇద్దరూ వరుసగా కన్ను మూయటంతో గ్రామం అంతా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకరిలేక మరొకరు ఉండలేని స్నేహం, ప్రేమ, నమ్మకం.. చివరి శ్వాస(last breath) వరకూ వీడని బంధం ఏమిటో ఈ ఘటన మరొక్కసారి మనకు గుర్తుచేసింది. గ్రామస్థుల మాటల్లో… “జీవితాంతం వీళ్లిద్దరూ ఎలా విడదీయలేని జంటలా(Like an inseparable couple) ఉన్నారో… మరణంలోనూ అదే బంధం కొనసాగింది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవీయ కోణంలో హృదయాలను కదిలించే ఈ దంపతుల కథ గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టిస్తోంది.
