గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 42
42

ఇంద్రియాణి పరాణ్యాహు:
ఇంద్రియోభ్య: పరం మన: |
మనసస్తు పరా బుద్ధి:
యో బుద్ధే: పరతస్తు స: ||

అర్థము : జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము, మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమమైనది.

భాష్యము : ఇంద్రియములు కామపు కార్యములకు మార్గముల వంటివి. వాటిని మూసివేసినా మనస్సు తన ఆలోచనలను ఆపదు. దానికి మించి బుద్ధి, దానికి అధిపతిగా ఆత్మ ఉండును. కాబట్టి ఆత్మ యొక్క సహజ స్థితి అయిన భగవంతుని దివ్యసేవలో నియుక్తులమగుట వలన ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చును. అప్పుడు ఒక దానిని అనుసరించి మరొకటిగా ఆత్మతో పాటుగా బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వేరే మార్గము లేక కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తాయి. అప్పడు తుచ్ఛమైన కామమునకు లోనయ్యే అవకాశము వుండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *