ప్రిస్టన్ భూములు కబ్జాకు పాల్పడితే సహించం

ప్రిస్టన్ భూములు కబ్జాకు పాల్పడితే సహించం

దశాబ్దాల చరిత్రను మాయం చేసేందుకు కుట్ర
మిషన్ భూముల జి పి ఏ హోల్డర్‌ కే.ఎం. జాన్

జనగామ, ఆంధ్రప్రభః జనగామ జిల్లా కేంద్రంలో అనేక దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రిస్టన్ భూములను కబ్జా చేసేందుకు కొంతమంది పన్నుతున్న కుట్రలను ఎటువంటి పరిస్థితుల్లో సహించమని మిషన్ భూముల జి పి ఏ హోల్డర్‌ కే.ఎం. జాన్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ1903 సంవత్సరంలో అమెరికా కు చెందిన రూథర్ఫర్డ్, ఓండ్రో అనే ఇద్దరు వ్యక్తులు జనగామ పట్టణంలో 61 ఎకరాల 31 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి విద్య వైద్యం కోసం సంస్థలు ఏర్పాటుచేయడంతో పాటు వసతి గృహాలు నిర్మించి ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తి కి విశేష కృషి చేశారని అన్నారు.


కాలక్రమంలో సోసైటీల నిర్మాణం ఏర్పాటు జరిగిందని, కొంతమంది స్వార్థపరులు సొసైటీలో చేరి ఇష్ట రాజ్యంలో వ్యవరించారని ఆరోపించారు. జనగామలో బస్ స్టాండ్, డిపో ల నిర్మాణానికి నాలుగు ఎకరాలకు పైగా స్థలం ఇచ్చామని, అనంతరం భూములపై టేనేంట్ విషయంలో సుప్రీంకోర్టు వరకు కేసు నడిచిందని అనంతరం రాజీమార్గంలో భూముల పంపకాలు జరిగాయని అనంతరం మిగిలిన భూమి ప్లిస్టన్ విద్యాసంస్థలు, వసతి గృహాలు, క్రీడా మైదానాలు యధావిధిగా ఉండాలని ఆదేశాలు ఉన్నాయని వారు తెలిపారు.

తప్పుడు రిజిస్ట్రేషన్ లతో కోర్టును పక్కదారి పట్టించి భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ వ్యవరంలో లో క్రైస్తవ సమాజం ఏకపక్షాన నిలబడి భూముల రక్షణకు పోరాడుతుందని వారు తెలిపారు. డబ్బులు ఉన్నాయన్న భావంతో విద్యాసంస్థల అధిపతి తుమ్మ జగన్మోహన్ రెడ్డి కొంతమందిని కలుపుకొని కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు.ఈ సమావేశంలో మిషన్ ఆస్తుల పరిరక్షణ, న్యాయ పరిరక్షణ సంఘ హక్కుల కమిటీ సభ్యులు దేవాదానం , సభ్యులు దామెర జేమ్స్, బక్కా ప్రవీణ్, యేసుపాదం, రాజరత్నం, తూడి ఆనంద్, సమూయేలు కరుణాకర్, దామెర ప్రసాద్, రాజ్‌కుమార్ రోడ్రిక్స్ ఫీల్డ్ ఎల్డర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply