• కర్నూలు డీఎస్పీ బాబూ ప్రసాద్
  • వీకర్ సెక్షన్ కాలనీ లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్


( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ) : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (Kurnool District SP Vikrant Patil ఉత్తర్వుల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ పై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సిఐ విక్రమ సింహా, కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది కలిసి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ (Weaker Section Colony) లో బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

రౌడీషీటర్స్, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. కౌన్సెలింగ్ చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ (Kurnool DSP) అక్కడి ప్రజలతో మాట్లాడారు. కర్నూలు పట్టణంలో రాత్రి, పగలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎక్కడైనా ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

కఠిన చర్యలు (Strict measures) తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సిన భాద్యత ప్రజల పై ఉందన్నారు. పోలీసులకు సమాచారం అందిస్తే విచారణ చేస్తామన్నారు. గంజాయి (Marijuana) వంటి మాదక ద్రవ్యాలకు పిల్లలు అలవాటు పడితే వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కేసుల్లో ఇరుక్కొని జీవితాలు జైలు పాలై నాశనం చేసుకుంటారన్నారు.

ఎవరైనా గంజాయి, సారా వంటివి విక్రయాలు చేసినా, గొడవలు పడినా పోలీసులకు దృష్టికి తీసుకురావాలన్నారు. అందరూ బుద్దీగా జీవించాలన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు (illegal activities) పాల్పడినా, కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూలు పట్టణ సిఐలు విక్రమసింహా, శ్రీధర్, శేషయ్య, పార్థసారథి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply