KTR | ఆదిలాబాద్ కు రేపు రానున్న కేటీఆర్
పత్తి రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి
KTR | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : పత్తి రైతులు (cotton farmers) ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) (KTR) సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డును ఆయన సందర్శించి రైతుల సమస్యలను తీసుకుంటారు.
సీమశాతం నిబంధనలో పరిమిత కొనుగోళ్ల అంశంలో సిసి అనుసరిస్తున్న వైఖరిని పార్టీ శ్రేణులతో కలిసి ఎండగట్టనున్నారు. ఆ తర్వాత సీసీఐ కార్యాలయాన్ని (CCI office) సందర్శించి రైతు సమస్యలపై ప్రస్తావిస్తారని, పార్టీ కార్యాలయంలో హాజరై ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొంటారని అదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.

