ktr l మోసపూరిత హామీలు … నమ్మకండి

ktr l మోసపూరిత హామీలు … నమ్మకండి


ktr l సిరిసిల్ల, (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తానని చెబుతున్నారని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు రైతుబంధు వేసిండో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు రైతుబంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి ఏ విధంగా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారన్నారు.


అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కానీ మరోసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేస్తే, మరొక్కసారి కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ని తిట్టాల్సిన అవసరం ఏముందని, చేతనైతే ప్రజలకు మంచి చేయాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలే కానీ కేసీఆర్ ని తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు.


కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలు చూసి ఓటు వేయాలన్నారు. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మంచా.. చెడ్డా అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల పోటీ గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య అంటూ అభివర్ణించారు.


మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కార్యాచరణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని గనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసంపై ప్రశ్నించకుంటే, మరో మూడేళ్ల దాకా ప్రజలకి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదన్నారు. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేలా ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా, సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తుందని తెలిపారు.

Leave a Reply