Komatigudem | గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం..

Komatigudem | గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం..
- నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించిన సెక్రటరీ
Komatigudem | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : రాబోయే ఐదేళ్లలో కోమటిగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన సర్పంచ్ సోమయ్య పేర్కొన్నారు. ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్ మండలం కోమటిగూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గంతో గ్రామ సెక్రటరీ సంతోష్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈసందర్భంగా నూతన సర్పంచ్ పనికర సోమయ్య మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఆలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు రాములవారి దేవాలయం నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అలాగే మహిళ భవనం ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు కోసం సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని రవి, వార్డు సభ్యులు బోయిని రాకేష్, రాజశేఖర్, అమల, రాధిక, సత్తయ్య, విమల, సునీల్ యాకుబ్, లావణ్యతో పాటు నాయకులు బోయిని ఐలయ్య, కొంకటి రమేష్, పాపయ్య, కారోబార్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
