Khanapur | VB-G RAM-G పథకాన్ని ప్రారంభించాలని వినతి

Khanapur | VB-G RAM-G పథకాన్ని ప్రారంభించాలని వినతి

Khanapur | ఖానాపూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రజల విన్నపం మేరకు బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామ రావు పటేల్ తో కలిసి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, ఖానాపూర్ బీజేపీ నాయకులు శనివారం హైదరాబాద్ లోని ఖానాపూర్ మున్సిపాలిటీలో VB-G RAM-G పథకాన్ని ప్రారంభించాలని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. గత ఖానాపూర్ పంచాయతీలో సుమారు 7వేల జాబ్ కార్డులు ఉండేవని.. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగించేవారని పేర్కొన్నారు.

ఖానాపూర్ పట్టణంలో నిరుపేద కూలీలే అత్యధికంగా ఉండడం, ఉపాధి హామీ పాథకానికి పట్టణం చుట్టుపక్కల వ్యవసాయ, భూములు, అటవీ ప్రాంతం అనుకూలంగా ఉందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న VB-G RAM-G పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విన్నవించారని.. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని రితేష్ రాథోడ్ తెలిపారు. అయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్, మండల అధ్యక్షులు పుప్పాల ఉపేందర్ లు ఉన్నారు.

Leave a Reply