Jukkal | గ్రామసభలో పాల్గొన్న సబ్ కలెక్టర్

Jukkal | గ్రామసభలో పాల్గొన్న సబ్ కలెక్టర్

Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని సావర్ గాం గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చెయ్యటం జరిగింది. ఈ గ్రామంలో 768 ఎకరాల భూమి ఉంది. ఈమొత్తం భూమికి సంబంధించి పైలెట్ సర్వేలు నిర్వహించనున్న దృష్ట గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభకు బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. రైతులు గ్రామస్తులందరూ భూ సర్వేకు తమవంతు సహకారం అందించాలని, భూసర్వే వల్ల భూముల సమగ్ర వివరాలు రైతులకు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్త బుజ్జిబయి ఆశా కార్యకర్తలతో కల్సి సబ్కలెక్టర్ కిరణ్మయికి గ్రామసభలో శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ గ్రామసభలో తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ బి.శ్రీనివాస్, గిర్ధవర్ రామ్ పటేల్, డిఐఓఎస్ తిర్మలేశ్వర్, జుక్కల్ సర్వేయర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply