jannaram | జలంతో నాగోబాకు కాలినడకన…

jannaram | జలంతో నాగోబాకు కాలినడకన…

  • కలమడుగు గోదావరిలో పూజల తర్వాత జలం తిరుగు పయనం..

jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి హస్తినా మడుగులోని రేవులో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు అనంతరం కలశంలో పవిత్ర జలాన్ని తీసుకొని కెస్లాపూర్ నాగోబా జాతరకు ఈ రోజు మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. గిరిజనుల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జాతరైన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర. ఈ జాతర ఈనెల 18న ప్రారంభమై 25న ముగిస్తుంది. గోదావరి జలంతో తిరిగి బయలుదేరిన మెస్రంవంశీయులు ఈనెల 18న కెస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో మహా పూజతో ప్రారంభమై, వారం పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తూ ఈనెల 25న నాగోబా జాతర ముగిస్తుంది.

jannaram

మెస్రం వంశీయులలోని పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్, పూజారి(కటోడ) కోసేరావు, తదిత 100 మంది మెస్రంవంశీయుల ఆధ్వర్యంలో కలమడుగు హస్తినమడుగులో ప్రత్యేక పూజలు చేసి నది జలాన్ని కలశంలో తీసుకొని అనంతరం సహాపంక్తి భోజనాలు చేసి కెస్లాపూర్ కు క్యూ లైన్ లో కాలినడకన తిరుగు పయనం అయ్యారు. రాత్రి జైనూరు మండలంలోని పిట్టగూడ కటోడ ఇంట్లో వారంతా రాత్రి భోజనాలు చేసి అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు అక్కడి నుండి బయలుదేరి ఈ నెల 14న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రదేవి వద్దకు చేరుకొని, బసచేసి ఆ తర్వాత వారంతా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా హాజరై, ఎంతో ఆరాధ్యంగా జాతరను జరుపుకుంటారు.

jannaram

Leave a Reply