Jainoor | బాలికల సంరక్షణ, బాల్య వివాహల నియంత్రణనే లక్ష్యం

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : బాలికల సంరక్షణ బాల్యవివాల లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు సాగర్, జెండర్ స్పెషలిస్ట్ రాణి అన్నారు. బుధవారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జై నూర్ మండలంలోని జ0గాం, పోచం లోద్ధి కేజీబీవీ పాఠశాలల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
బాలికల సంరక్షణ సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి అనంతరం అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… బాల్యవివాహాలు ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. బాల్య వివాహలు చేయడం చట్ట విరుద్దమని, బాల్య వివాహాలకు ఎవరైన పాల్పడితే శిక్షర్హులు అవుతారని, బాల్య వివాహల వల్ల కలిగే నష్టాలను, వివరించారు. ఎవరైనా తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరగకుండ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలనీ, గృహహింస 181 హెల్ప్ లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు.
మానవ అక్రమ రవాణా జిల్లాలో చాలా విస్తరిస్తుందని దీని పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని ఇలాంటి ఉచ్చులో చిక్కుకోకూడదని అన్నారు.18 సంవత్సరాల లోపు ఆడపిల్లలపైన లైంగిక వేధింపులకు పాల్పడితే పొక్సో చట్టం కింద చర్యలుతీసుకోవడంజరుగుతుందని వారు పేర్కొన్నారు. హాయ్ ఆ కార్యక్రమాల్లో జైనూర్ ఐ సి డి ఎస్ సి డి పి ఓ ఇందిరా, జంగం సర్పంచ్ పేందూరు అనసూయ అర్జున్, జంగం పంచాయతీ కార్యదర్శి మనోజ్ కుమార్, కేజీబీవీ ఎస్ఓ సుమలత, గ్రామైక్య సంఘ నాయకురాలు వార్డు మెంబర్లు మహిళలు, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
