Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra Prabha Detail Report

Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra Prabha Detail Report
టెహ్రాన్‌లో టార్గెట్ కిల్లింగ్?
ఇరాన్ అగ్రనేతల మరణ వార్తల దుమారం
లారిజానీ, సులేమానీని చంపేశాం
ఇజ్రాయెల్ సంచలన క్లెయిమ్
ఇరాన్ మౌనం.. అనుమానాల్లో ప్రపంచం
ఇరాన్‌కు భారీ షాక్
యుద్ధం కొత్త మలుపు..
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
ఇజ్రో అమెరికా ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరి లో తమ దేశంపై ఇటె బాంబుల వర్షం అట9 క్షిపణుల జడివానను… కేవలం డ్రోన్లతో తిప్పి కొడుతున్న ఇరాన్ షాక్ గురయ్చే కబురును ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సర్కారు నియంత్రణ, కార్యాచరణలో.. కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు యోధాను యెధులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తాజా ప్రకటన జారీ చేసింది.

ఇరాన్ అత్యంత శక్తివంత రాజకీయ నాయకుడు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (SNSC) సెక్రటరీ అలీ లారిజానీ (Ali Larijani) , బసిజ్ పారామిలిటరీ గ్రూపు కమాండర్ ఘోలమ్రేజా సులేమానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ధృవీకరించింది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటను ఖండించలేదు. అంగీకరించలేదు. కానీ ఈ ఇద్దరు కీలక నేతల ఆచూకీ లేకపోవటంతో ఇజ్రాయెల్ ప్రచారం వైరల్ అవుతోంది.
Isreal Target 2 Heads : వీళ్లిద్దరినీ చంపేశాం : ఇజ్రాయెల్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం రాత్రిపూట జరిపిన వైమానిక దాడుల్లో అలీ లారిజానీని హతమార్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) ప్రకటించారు. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ పై దాడిలో ఇటీవల బసిజ్ పారామిలిటరీ గ్రూపు కమాండర్ ఘోలమ్రేజా సులేమానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ధృవీకరించింది.
Isreal Target 2 Heads : వైమానిక దాడిలో…

ఇజ్రాయెల్ సైనిక గూఢచార విభాగం అందించిన కచ్చిత నిఘా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. “సైనిక గూఢచార విభాగం నుండి అందిన కచ్చిత నిఘా సమాచారం మేరకు, వైమానిక దళం నిన్న టెహ్రాన్ నగర నడిబొడ్డున లక్షిత దాడి నిర్వహించి, గత ఆరేళ్లుగా బసిజ్ యూనిట్ కమాండర్‌గా ఉన్న ఘోలమ్రెజా సులేమానీని హతమార్చింది,” అని అది తెలిపింది. ఇప్పటి వరకు, ఇజ్రాయెల్ ప్రకటనను ఇరాన్ అంగీకరించలేదు ఖండించలేదు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న అలీ లారిజానీ, ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన మరో దాడిలో హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.
Isreal Target 2 Heads : కచ్చిత నిఘాతో స్పాట్..

ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ పై రాత్రిపూట జరిపిన దాడిలో ఇటీవల బసిజ్ గ్రూపు ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో సులేమానీ ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. ఇస్రాయెల్ సైన్యం దాడి చేసి, ఇరాన్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత బసిజ్ గ్రూపు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని IDF తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో బసిజ్ గ్రూపులోని డిప్యూటీ కమాండర్ ఇతర అధికారులు కూడా మరణించారని IDF తెలిపింది. “ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు, గత ఆరేళ్లుగా బసిజ్ యూనిట్ కమాండర్ బాధ్యతలు నిర్వఙహస్తున్న ఘోలం రెజా సులేమానీని హతమార్చేందుకు, వైమానిక దళం టెహ్రాన్ నగర నడిబొడ్డున దాడి చేసింది” అని ఇజ్రాయెల్ వైమానిక దళం తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
Isreal Target 2 Heads : ఇరాన్ మౌనం

ఇజ్రాయెల్ ప్రచారాన్ని ఇరాన్ ప్రభు త్వం ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఆయన మరణించారా లేదా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆయన ఆచూకీ లేదు. అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 2026లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, దేశాన్ని నడిపించడంలో లారిజానీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Isreal Target 2 Heads : అలీ లారిజానీ ఎవరు?

అలీ లారి జానీ 2008 నుంచి 2020 వరకు ఇరాన్ పార్లమెంట్ (Majles) స్పీకర్‌గా పనిచేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రపంచ దేశాలతో చర్చలు జరపడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఇరాన్‌లో అత్యంత ప్రభావవంత “లారిజానీ కుటుంబం” నుండి వచ్చిన ఆయన, దేశ రక్షణ మరియు వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Isreal Target 2 Heads : హూ ఈజ్ సులేమానీ ?

ఘోలంరెజా సులేమానీ ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లో ఒక సీనియర్ అధికారి. ఆయన ఆరేళ్లపాటు స్వచ్ఛంద మిలీషియా దళం బసిజ్‌కు నాయకత్వం వహించారు. మార్చి 2026లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన ప్రకటనల ప్రకారం, సులేమానీ ఒక వైమానిక దాడిలో మరణించారు. అంతర్గత అసమ్మతిని అణచివేయడం, సామూహిక అరెస్టులు చేయడం మార్గనిర్దేశం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Isreal Target 2 Heads : మరణవార్తలపై దుమారం
ఈ మరణాలు ధృవీకరణ ఇంకా మిస్టరీగా ఉంది. ఈ మరణాలు నిజమని తేలితే 2026 ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఘర్షణలో ఇరాన్ అత్యున్నత స్థాయి నాయకులను కోల్పోయినట్టే. యుద్ధం ప్రారంభంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వం ప్రత్యక్ష లక్ష్యాలుగా మారడంతో, ఈ సంఘర్షణ తీవ్రతరం కాబోతోందని ప్రచారం జరుగుతోంది.
Isreal Target 2 Heads : సులేమానీ పాత్ర ఏమిటి?
అమెరికా ట్రెజరీ రికార్డుల ప్రకారం 1965లో జన్మించిన ఘోలమ్రెజా సోలేమానీ, గత ఆరేళ్లుగా బసిజ్ విభాగానికి నాయకత్వం వహించారు. ఇరాన్‌లో నిరసనలు, అసమ్మతిని అణచివేయడంలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి.
Isreal Target 2 Heads : బసిజ్ దళం అంటే ఏమిటి?

బసిజ్ అనేది ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక స్వచ్ఛంద పారామిలిటరీ బృందం. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అంతర్గత భద్రతను కాపాడటానికి ఇది ఏర్పడింది. ఈ బృందం ఇరాన్‌లోని నగరాలంతటా బలమైన ఉనికిని కలిగి ఉంది మరియు నిరసనల సమయంలో తరచుగా మోహరించబడుతుంది. వివాదాస్పద ఎన్నికలపై 2009లో జరిగిన భారీ నిరసనలతో సహా, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను అణచివేస్తోందని దీనిపై ఆరోపణలు ఉన్నాయి.
Isreal Target 2 Heads : బసిజ్ దళాలే ఎందుకు టార్గెట్
ఇరాన్ ప్రభుత్వ నియంత్రణ, కార్యాచరణలో బిసి దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆఫరేషన్ లో బసిజ్ ఇతర అంతర్గత భద్రతా విభాగాలు కీలక లక్ష్యాలుగా మారాయి.
ALSO READ : Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra Prabha News
