ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన

ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన

నీటి ఎద్దడి నివారణకు సాగర జలాలే శరణ్యం

వేంసూరు, ఆంధ్రప్రభ : వేసవి ఎండలు ప్రారంభం కాకమునుపే భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో సాగర్ జలాలతో చేరువులు నింపాలని కేజీ మల్లెల సర్పంచ్ కారుమంచి రజని ప్రసాద్ (కెపి) ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ శాఖాధికారులు గురువారం గ్రామం లోని చెరువులను, త్రాగునీటి బోరు బావులను పరిశీలించారు. సాగర్ జలాల మళ్ళింపునకు అవసరమైన చర్యలను పరిశీలించారు. సాగర్ జలాలతో చెరువులు దింపేందుకు త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సిబ్బంది ఇమ్మానియేల్, గ్రామ పెద్దలు కారుమంచి ప్రసాద్, చెరువు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కారుమంచి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply