Iran Toll Troll : హోర్మజ్ తెరిస్తే,, Andhra Prabha Top Story

Iran Toll Troll : హోర్మజ్ తెరిస్తే,, Andhra Prabha Top Story
ఇరాన్ కే లాభం
జలసంధిలో క్యాష్ కౌంటర్
తాళం వేసినా..
కాసులు గలగలే
ఒప్పందంతో అఫీషియల్ టోల్
అలిగితే.. అనధికార కప్పం
ఇదీ రాన్ కొత్త గేమ్
టోల్ దెబ్బకు గ్లోబల్ షాక్
కేప్ టౌన్ వైపు చూపు..
ప్రపంచ దేశాల ఆందోళన
ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి

కాల్పుల విరమణకు ఒప్పంకదం కుదిరిన కొన్ని గంటల్లోనే హోర్ముజ్ జలసంధికి ఇరాన్ తాళం వేసింది. 400 పైగా ఆయిల్ ట్యాంకర్లు, ఎల్నీజీ, ఎల్ఎన్జీ క్యారియర్లు,,, ఇతర సరకుల నౌకలు లంగరు వేయక తప్పదు. ఇటు హోర్ముజ్ తెరచినట్టు అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ఖాతాలో గర్వంగా చెప్పారు. కానీ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిలో వందలాది మంది ప్రాణాలు తీశారని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందా లేదా అని ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి ఆరంభమైంది.

ఇక అమెరికా , ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగిసినా.. ప్రపంచ దేశాలను హోర్ముజ్ జాఢ్యం వీడదు. రాజీ ఒప్పందాల్లో హొర్ముజ్ జలసంధి ఇరాన్ కే దక్కుతుంది, కనీసం యుద్ధం నష్ట పరిహారం పేరుతో… హోర్ముజ్ జలసంధి .. ఇరాన్‌కు ఆదాయ వనరుగా మారిపోవటం ఖాయం. ఇప్పటికే ఇరాన్ టోల్ కోసం వివిధ దేశాల తోలు తీస్తోంది.
Iran Toll Troll : కప్పం కట్టాల్సిందే

జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ ఒక్కో బ్యారెల్ చమురుకు $1 చొప్పున టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ చెల్లింపులను క్రిప్టోకరెన్సీ లేదా చైనీస్ యువాన్లలో అడుగుతోంది. ఇప్పటికే ట్రాన్సిట్ ఫీజు వసూళ్ల ప్రారంభించింది. ప్రతి నౌక పరిమాణం తరలించే సరుకు బట్టి $100,000 నుండి $500,000 వరకు (సుమారు ₹80 లక్షల నుంచి ₹4 కోట్ల వరకు) చెల్లించాల్సి వస్తోంది. ఇరాక్ నౌకలకు పూర్తి ఫీజు మినహాయింపు ఇచ్చారు. చైనా, రష్యా దేశాలకు కొన్ని రాయితీలు ఇస్తున్నారు. ఇటీవల 22 భారత నౌకల నుంచి కూడా ఇరాన్ కప్పం వసూలు చేసింది.
Iran Toll Troll : లంగరులోని ఓడల స్థితి అంతే..

అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల కాల్పుల విరమణను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి 24 గంటలు పైగా గడిచినా, హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు నామమాత్రంగానే ఉన్నాయి. గురువారం ఉదయం నాటికి, పర్షియన్ గల్ఫ్‌లో పెద్ద సంఖ్యలో నౌకలు ఇంకా లంగరు వేసి ఉన్నాయని మెరైన్‌ట్రాఫిక్ డేటా చూపించింది. ఒక రోజు ముందు ట్రాకర్ డేటా ప్రకారం, 400కు పైగా ట్యాంకర్లు, 34 ఎల్పీజీ ట్యాంకర్లు , 19 ఎల్ఎన్జీ నౌకలు హోర్ముజ్ జలసంధి బయటే ఉన్నాయి. ఈ నౌకలన్నీ టోల్ ఫీజు చెల్లిస్తామని ప్రాధేయపడినా.. ప్రస్తుత యుద్ధవాతావరణం కలసి రావటం లేదు. ఇక భారత్ సహా హోర్ముజ్ జలసంధి మార్గానికి ప్రత్యామ్నం వెతుకుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని కేప్ టౌన్ మీదుగా ఓడలకు మార్గం ఉంది. కానీ ఈ మార్గంలో ప్రయాణ దూరం,కాలం చాలా ఎక్కువ. దారి ఖర్చులూ భరించటం చాలా కష్టం. కానీ న్రత్యామ్నయ మార్గం తప్పదని.. ఆ మార్గాన్వేషణలో జపాన్, సింగపూర్, ఫిలిఫ్పైన్స్.. వియత్నాం, థాయ్‌ల్యాండ్.. మలేషియా, దక్షిణ కొరియా జుట్టు పీక్కుంటున్నాయి.
Iran Toll Troll : పరస్పర విరుద్ధం

ఆ జలసంధి “తెరిచి, సురక్షితంగా” ఉంటుంది, అని బుధవారం రాత్రి ట్రూత్ సోషల్ పోస్ట్‌లో, ట్రంప్ చెప్పారు. అంతకుముందు, ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన బాంబు దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ జలమార్గాన్ని మూసివేసినట్టు ఐఆర్జీసీ పేర్కొంది. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత , గ్రీకు యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ NJ ఎర్త్ , లైబీరియా బల్క్ క్యారియర్ డేటోనా బీచ్ సహా కొన్ని నౌకలు ఈ జలసంధిని దాటి ఊపిరి పీల్చుకున్నాయి.
Iran Toll Troll : అర్థం కాని స్థితి…

లాయిడ్స్ లిస్ట్ ఆధారంగా.. యుద్ధానికి ముందు, సగటున ప్రతిరోజూ 107 సరుకు రవాణా నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేవి. ఇప్పుడు గత 40 రోజులుగా యుద్ధవాతావరణం నెలకొనటంతో… చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్ తదితర దేశాల మినహా నౌకలు కదలటం లేదు. ప్రపంచంలోని చాలా నౌకాదళానికి బీమాను అందించే నార్త్ స్టాండర్డ్ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ రీ ఇన్సూరెన్స్ ప్రతినిధి సైమన్ కే, మాట్లాడుతూ ఇది చాలా వరకు వేచి చూసే పరిస్థితి” అని అన్నారు. గల్ఫ్ దేశాలకు, అమెరికా నౌకలకు ఇరాన్ మీదుగా హోర్ముజ్ జలసంధిని దాటటానికి రహస్య మార్గం లేదన్నారు.
