Internet | అప్రకటిత ఎమర్జెన్సీ

Internet | అప్రకటిత ఎమర్జెన్సీ

Internet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత ఐదో రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ మరింత కట్టుదిట్టమైంది. యుద్ధ ఉద్రిక్తతలు, దాడులు, ప్రతీకారాల మధ్య ప్రభుత్వం ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను మరింత బలంగా అమలు చేస్తోంది. యుద్ధ వార్తలు, అల్లర్ల సమాచారం, ప్రజల నిజాలు బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా కట్టుదిట్టమైన సెన్సార్‌షిప్, నియంత్రణలు అమలవుతున్నాయి.

ఇంటర్నెట్ వాడేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు – బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్లు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు, వైద్య సమాచారం, అత్యవసర సహాయం అందుబాటులో లేకుండాపోయాయి. ఇరాన్ ప్రజలు ఇప్పుడు దాదాపు పూర్తి సమాచార బందీలుగా మారారు. ఈ ఇంటర్నెట్ బ్లాక్‌డౌన్ దేశంలోని ప్రజాస్వామ్య హక్కులు, సమాచార స్వేచ్ఛపై భారీ దెబ్బగా మారింది. ప్రపంచ దేశాలు, మానవ హక్కుల సంస్థలు ఈ పరిస్థితిని ఆందోళనతో పర్యవేక్షిస్తున్నాయి.

CLICK HERE TO READ MORE : 5mar2026 | షా(క్రా)కర్స్…విధ్వంసం…విద్వేషం..

CLICK HERE TO READ MORE

Leave a Reply