Indiramma houses | ఇందిరమ్మ గృహాల ప్రారంభం

Indiramma houses | ఇందిరమ్మ గృహాల ప్రారంభం
Indiramma houses | మునుగోడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చీకటి మామిడి గ్రామంలో నూతనంగా నిర్మించకున్న ఇందిరమ్మ గృహాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.
గ్రామానికి చెందిన మారగోని స్వామి, అనంత రమేష్ లకు మంజూరైన ఇందిరమ్మ గృహాల నిర్మాణం(Construction of Indiramma houses) పూర్తి కావడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెళ్లి రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
