భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా శుభ్‌మన్ గిల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్… 250 పరుగుల మార్కును (348 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు) అధిగమించాడు. ఈ సందర్బంగా గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించాడు.
గిల్ తిరగరాసిన రికార్డులు:
- SENA దేశాల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ (245), సచిన్ టెందుల్కర్ (241) రికార్డును బద్దలు కొట్టాడు.
- ఇంగ్లాండ్ టెస్టుల్లో భారత బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనతను పొందాడు.
- ఇండియన్ టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (254)* రికార్డును బద్దలుకొట్టాడు.
- టెస్టు క్రికెట్‌లో 250+ స్కోరు చేసిన ఐదో భారత బ్యాటర్గా గిల్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్, ద్రావిడ్, లక్ష్మణ్, కోహ్లి, కరుణ్ నాయర్ మాత్రమే అందుకున్నారు.
మ్యాచ్ పరిస్థితి:
- భారత్ స్కోరు: 528/7 (138.4 ఓవర్లు)
- గిల్: 260* (369 బంతులు)
- వాషింగ్టన్ సుందర్: 42 – ఔట్ (103 బంతులు)
- 7వ వికెట్‌కు భాగస్వామ్యం: 144 పరుగులు
ఇంగ్లాండ్‌లో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక 7వ వికెట్ భాగస్వామ్యం:
- 160* - మనోజ్ ప్రభాకర్ – సచిన్ టెండూల్కర్, మాంచెస్టర్, 1990
- 144 – శుభ్‌మాన్ గిల్ – వాషింగ్టన్ సుందర్, బర్మింగ్‌హామ్, 2025, ఈ ఇన్నింగ్స్*
- 126 – వివిఎస్ లక్ష్మణ్ – అజిత్ అగార్కర్, లార్డ్స్, 2002
- 110 – కపిల్ దేవ్ – రవిశాస్త్రి, ది ఓవల్, 1990
- 100 – రిషబ్ పంత్ – శార్దుల్ ఠాకూర్, ది ఓవల్, 2021
18 ఏళ్ల తర్వాత 500+:
ఇంగ్లాండ్‌లో భారత జట్టు 500 పరుగుల మార్క్‌ను 18 ఏళ్ల తర్వాత దాటి చరిత్రలో స్థానం సంపాదించింది. చివరిసారిగా 2007లో ది ఓవల్ టెస్టులో 664 పరుగులు చేయడం జరిగిన విషయం గమనార్హం.
గిల్ ఇన్నింగ్స్ కేవలం వ్యక్తిగత ఘనతకే పరిమితం కాకుండా, జట్టు పునరాగమనానికి మార్గం వేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇన్నింగ్స్ గిల్ కెరీర్‌లోనే కాక, భారత టెస్ట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది.