అలా డాలర్ పెరిగితే.. ఇలా బంగారం తగ్గిందండి

అలా డాలర్ పెరిగితే.. ఇలా బంగారం తగ్గిందండి

(ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) భారత బంగారం విపణిలో.. కేవలం కొన్ని గంటల్లోనే బంగారం ధర నేలకు దిగింది. అమావాస్య రోజున బంగారం కొనుగోళ్ల గిరాకీ కారణంగా.. మార్కెట్లో అక్కస్మాత్తుగా బంగారం ధర ఆకాశం వైపు పరుగులెట్టింది. మంగళవారం ఉదయం నుంచి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,32,770లకు చేరింది. రూ.2,080లు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,900లు పెరిగి రూ.1,21,700లకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1.560లు పెరిగి రూ.99,580లకు చేరింది. ఇక సామాన్యులు బంగారు ఆభరణాలను కొనలేని స్థితిలో ధర ఆకాశం వైపు దూసుకు పోతోందని అందరూ భావిస్తుంటుంటే.. రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా బంగారం ధర తగ్గింది. ఎంత అంటే.. గత రెండు రోజుల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,32,770లకు పెరిగితే.. బుధవారం రూ.1,27,200లకు తగ్గింది. అంటే ఈ రెండు రోజుల్లో రూ.5,570లకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,100లు, 18 క్యారెట్ల బంగారం రూ.4,100లు తగ్గింది. అకస్మాత్తుగా బంగారం ధర ఇంతగా తగ్గటానికి కారణమేంటీ.?

అంతా అమెరికా వల్లనే..
బంగారం ధరలు గత వారం రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి ($4,381 ప్రతి ఔన్స్ వరకు). పెట్టుబడిదారులు తమ లాభాలను ఆదా చేసుకోవడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ఇది 2013 తర్వాత బంగారం ధర 56 శాతం పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం అమెరికా డాలర్ పుంజుకుంది. డాలర్ ఇండెక్స్ 98.91కి చేరుకుంది. బంగారం వంటి సేఫ్-హేవెన్ ఆస్తుల పై ఒత్తిడి పెరిగింది. డాలర్ బలంతో బంగారం కొనుగోళ్లు మారాయి. ఇక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.

అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల అభివృద్ధి, ట్రంప్ వ్యాఖ్యలు వంటివి గ్లోబల్ అనిశ్చితులను తగ్గించాయి. దీంతో బంగారం పట్ల డిమాండ్ తగ్గి, ధరలు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్లు మందం తగ్గించే అవకాశాలు తగ్గడంతో, బాండ్ యీల్డ్‌లు పెరిగి బంగారం పై ప్రభావం చూపాయి. ఇన్‌ఫ్లేషన్ 2.7 శాతానికి చేరుకున్నప్పటికీ, దీని తగ్గుదల బంగారం డిమాండ్‌ను ప్రభావితం చేసింది. ఇక దీపావళి ముందు డిమాండ్ తగ్గింది. భారత్‌లో దీపావళి సీజన్ ముందు ధన్ థెరాస్ కొనుగోళ్లు పెరిగినా, ధరలు రికార్డు స్థాయిలకు చేరుకున్న తర్వాత కరెక్షన్ వచ్చింది. MCXలో డిసెంబర్ కాంట్రాక్ట్ ₹1,28,000కి (10 గ్రాములకు) పడిపోయింది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ 2025లో బంగారం ధరలు 57- నుంచి 62 శాతం పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో మేలిమి బంగారం ధర 245 డాలర్లు క్షీణించి, 4097 డాలర్లకు దిగి వచ్చింది.

Leave a Reply