HYDRAA | పాసు పుస్త‌కాల‌తో పాత లే ఔట్ల క‌బ్జా – ప్ర‌జావాణికి ఫిర్యాదులు

హైదరాబాద్ – తండ్రులు అమ్మారు.. త‌న‌యులు వ‌చ్చి పాసు పుస్త‌కాలు త‌మ పేరిట సృష్టించుకుని పాత లే ఔట్ల‌ను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేసేస్తున్నార‌ని హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదులందాయి.

సోమ‌వారం హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయి. ఇందులో పాత‌లేఔట్ల ఆక్ర‌మ‌ణ‌లే ఎక్కువ‌గా ఉన్నాయి. ఇందులో ర‌హ‌దారులు, పార్కులు కూడా ఉన్నాయ‌ని.. వీటిని కాపాడాల‌ని ప‌లువురు ఫిర్యాదులంద‌జేశారు. లే ఔట్ల‌లో ర‌హ‌దారుల‌ను క‌బ్జాచేయ‌డం, పార్కులు క‌లిపేయ‌డం వంటివి జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. అలాగే మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌బ్జాచేస్తున్నార‌ని.. వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పంద‌న ఉండ‌టంలేద‌ని ప‌లువురు వాపోయారు.

https://twitter.com/Comm_HYDRAA/status/1899087182201315608?t=ZLbT3xDr_fNKCXAVkYYeuw&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *