HYD | ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా…

HYD | ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా…
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను హత్య చేసిన తల్లి అనంతరం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో విషాదకర సంఘటన వెలుగుచూసింది. ఒక మహిళ తన ఇద్దరు కుమారులను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో కూడా ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
