HYD | కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కారుపై దాడి !

హైదరాబాద్, తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారుపై గుర్తుతెలియని సుమారు 30 మంది యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి నగరంలో బోనాల ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గణేష్ ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ (OUPS)లో ఫిర్యాదు చేశారు. దాడి వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Leave a Reply