HYD | పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు..

HYD | పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు..
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ జోనల్ యూనిట్ వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై కీలక ఆపరేషన్ నిర్వహించింది. పులి (టైగర్) అవయవాలను అక్రమంగా గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి ఏడు పులి గోర్లు, మూడు పులి దంతాలు (కేనైన్ టీత్) స్వాధీనం చేసుకున్నారు. పులి గోర్లు, దంతాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందడంతో, డీఆర్‌ఐ హైదరాబాద్ యూనిట్ ప్రత్యేక ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించింది. ఆ మేరకు అదే రోజు సమన్వయంతో కూడిన వేగవంతమైన చర్య చేపట్టి, అనుమానితులను గుర్తించి అడ్డుకున్నారు.
