Hospitals | ప్రభుత్వ ఆసుపత్రుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి…

Hospitals | ప్రభుత్వ ఆసుపత్రుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి…
మెరుగైన వైద్య సేవలు అందించాలి
సమయపాలన పాటిస్తూ విధుల పట్ల బాధ్యతగా పనిచేయాలి..
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Hospitals | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రజలకు నమ్మకం పెంచేలా విధుల పట్ల నిర్లక్ష్యం చేయ కుండా బాధ్యతా యుతం గా విధులు నిర్వ ర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిం చాలని, సమయ పాలన పాటించాలని తెలిపారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరి గేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలె క్టర్ ఇలా త్రిపాఠి గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబా టులో ఉన్న సదుపా యాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజ రును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.
జీజీహేచ్ లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు.మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థా యిలో అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తీసుకుం టామని, వైద్యులు, సిబ్బం ది అందరూ అంకితభా వంతోబాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.

