విధులను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలి…

విధులను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలి…

డీసీ హెచ్ ఎస్ కు ఫిర్యాదు
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తమ విధులను నిర్లక్ష్యం చేస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా డి సి హెచ్ ఎస్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రసూతి పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయకుండా వారు సొంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన పరికరాలు ఉండవని, ఇక్కడికి వచ్చే పేషెంట్లకు సూచిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారంతా బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాల వారే వస్తారని, ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు చెల్లించలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, అలాంటప్పుడు ఇక్కడే వైద్యం చేసినటువంటి డాక్టర్లు తమ వ్యాపారం కోసం సొంత ఆసుపత్రికి పంపడం సరైన పద్ధతి కాదని, అలాంటి వైద్యులపై చర్యలు తీసుకొని వారిని ఇక్కడి నుండి బదిలీ చేయాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని, వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, ఉడుత రామలింగం, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, నీళ్ల బిక్షపతి, దాసరి యాదయ్య, దాసరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply