మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం స్వప్న సోమనర్సయ్య దంపతులను గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గుర్రం కవిత లక్ష్మి నరసింహ రెడ్డి దంపతులు స్వయంగా శాలువా కప్పి సన్మానించారు. మోత్కూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. మున్సిపల్ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కోరారు.

Leave a Reply