ఘనంగా సన్మానం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతాసత్య యాదవ్ ను ఊట్కూర్ మండల భాజపా శ్రేణులు మంగళవారం ఘనంగా సన్మానించి అభినందించారు. బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్ రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి విజయ్ కుమార్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ లఆధ్వర్యంలో చైర్ పర్సన్ ను కలవగా పార్టీ శ్రేణులకు చైర్ పర్సన్ శ్వేతా సత్య యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా సత్య యాదవ్ మాట్లాడుతూ నారాయణపేట మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి చేసేందుకు తనకు పట్టం కట్టారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులు తీసుకువచ్చి నారాయణపేట పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండ కృషి చేస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తూ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దామన్నారు.
పార్టీ నాయకులు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ ఉప సర్పంచ్ రమేష్, జిల్లా వాణిజ్య కన్వీనర్ కృష్ణయ్య గౌడ్,మాజీ ఎంపిటిసిహన్మంతు జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొండన్ గోపాల్ మాజీ మండల అధ్యక్షులు రమేష్, వార్డు సభ్యుడు అశోక్ గౌడ్, నాయకులు కార్యకర్తలు గొల్ల శ్రీకాంత్, బాలాంజనేయులు, రోషనప్ప, రాజారెడ్డి, మహేష్, రారా కృష్ణ, అనిల్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
