Heavy rain | జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..

Heavy rain |జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..
- ఎగసిపడుతున్న సముద్రపు అలలు
- వేటకు వెళ్ళని మత్స్యకారులు
- వర్షాలతో వణుకుతున్న రైతన్న
Heavy rain| ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్విత్వ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్1077 ను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ (Collector) రాజాబాబు అప్రమత్తం చేశారు. ఆర్డీవో ఎంఆర్ఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను కలెక్టర్ సమీక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు (Fishermen) వేటకు వెళ్లలేదు. తమ బోట్లుతెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల తుఫాన్ తో భారీగా నష్టపోయామని ప్రస్తుతం ఈ తుఫాన్ తో మరింత నష్టాన్ని చవి చూస్తున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలు భారీ వర్షాలు (Heavy rains) కురిస్తే రైతాంగానికి అపారమైన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఈపాటికి తుఫాన్ ప్రభావంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలోని చెరువులన్నీ జలకలతో ఉన్నాయి. ఈ తుఫాన్ తో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ చెరువులకు భారీ గళ్ళు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జిల్లాలోని ప్రజలు భారీ వర్షం హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.

