తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..

ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం, తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Leave a Reply