గుండెపోటుతో బాలుడు మృతి…

గుండెపోటుతో బాలుడు మృతి…
కోసిగి, ఆంధ్రప్రభ : బ్రతుకు నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లిన కర్ణాటకకు చెందిన యాదగిరి జిల్లా తుమకూరు గ్రామానికి చెందిన శివప్ప మల్లమ్మ దంపతుల రెండవ కుమారుడు రమేష్ (14,) బుధవారం కోసిగి ఆసుపత్రిలో గుండెపోటు తో మరణించాడు. వివరాలు పరిశీలిస్తే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి కోసిగి మీదుగా యాదగిరికి వెళ్లే నాందేడ్ ఎక్స్ప్రెస్ లో వెళ్లు తున్నారు, అయితే ఉదయం రైలు కోసిగి రైల్వే స్టేషన్ చేరుకున్న సమయంలో ఉన్నట్టుండి రైలులో ఉన్న రమేష్ అపాస్మరస్థితిలోకి వెళ్ళాడు, వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు రైలు దిగి కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హుటాహుటిన తరలించారు.
పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు, బ్రతుకు జీవనం కోసం బెంగళూరుకు వలస వెళ్లినా విధిరాత వదలడం లేదని, భగవంతా మేము ఏమి కర్మ చేశము, అంటూ గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. చిన్న వయస్సులొనే రమేష్ చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు, మృతదేహాన్ని తమ స్వగ్రామమైన యాదగిరి తరలించారు.
